మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : శుక్రవారం, 13 మే 2016 (13:22 IST)

అందం... ఆరోగ్యానికి మేలు చేకూర్చే టిప్స్...

పాలు మన ఆరోగ్యానికి చాల మంచిది. ఇవి ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం.. 
 
ప్రతి రోజూ ముఖానికి పాలను రాసుకోవడం వల్ల ముఖం మీద ఉండే మురికితోపాటు మృత కణాలు పోయి చర్మం నిగనిగలాడుతుంది.
 
అరటిపండు గుజ్జులో, కొద్దిగా తేనె, కొంచెం పాలు కలిపి ముఖానికి రుద్దుకోవాలి. కొద్దిసేపు తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ముఖంలో జిడ్డుతనం పోయి నిగనిగలాడుతుంది. 
 
కప్పు పాలలో కొద్దిగా ఓట్స్ వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల చర్మం మృదువుగా తయారవుతుంది.
 
కోడిగుడ్డు తెల్ల సొన, పచ్చిపాలలో కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకోని 20 నిమిషాలు తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
పాలలో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం మీద మచ్చలు పోతుంది.