గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : శనివారం, 5 సెప్టెంబరు 2015 (12:40 IST)

మృదువైన ముఖ చర్మానికి పాల మీగడ..

వాతావరణం కాలుష్యం కారణంగా ముఖంపై మృదువుతనం కోల్పోతుంది. దాన్ని తిరిగి పొందాలంటే పాల మీగడ బాగా ఉపకరిస్తుంది. రాత్రిళ్లు పడుకోబోయే ముందు ముఖానికి కొద్దిగా పాలమీగడను రాసుకుని, బాగా మర్దన చేయాలి. అలానే పడుకునే తర్వాత రోజు ఉదయం కడిగేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేయడం వల్ల ముఖంపై చర్మం మృధువు ఆరోగ్యంగా కనిపిస్తుంది. 
 
అదే విధంగా రాత్రిళ్లు కొద్దిగా ఆలివ్ నూనెను, రాసుకుని మర్దన చేస్తున్నా మర్నాటికి ముఖం తాజాగా, కోమలంగా కనిపిస్తుంది. కొందరికి పొద్దున్నే నిద్రలేవగానే ముఖం ఉబ్బినట్టుగా ఉంటుంది. ఆ సమస్యను తగ్గించుకోవాలంటే రాత్రి పూట తీసుకునే భోజనంలో ఉప్పు శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
 
రాత్రి పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ముఖానికీ, కంటి భాగంలో ఏదయినా మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా తొలగించుకోవాలి. తరువాత కొద్దిగా మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ముఖం కడుక్కున్న వెంటనే రాసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.