గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2014 (18:25 IST)

నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకుంటే?

అందంగా ఉండాలనుకుంటున్నారా? బ్యూటీ పార్లర్లలో భారీ మొత్తాన్ని వెచ్చించకూడదనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోండి. 
 
కాటన్ బాల్ లేదా మెత్తగా ఉండే కాటన్ క్లాత్‌తో తుడవండి. కంటి కింద నోస్ దగ్గర కాటన్ బాల్‌తో శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేయడం ద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. 
 
టోనింగ్‌కు ఆల్కహాల్ లేని టోనర్‌ను ఉపయోగించి టోనింగ్ చేసుకోవచ్చు. ముఖం మృదువుగా, తేమగా ప్రకాశంతంగా ఉండాలంటే.. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మాయిశ్చరైజ్ చేసుకోవాలి. అందుకు నేచురల్ ఫేస్ ఫ్యాక్స్‌ను అప్లై చేయాలి. తర్వాత ఉదయం కూడా ముఖానికి లైట్ ఫేస్ క్రీమ్‌ను అప్లై చేసి, నిధానంగా మసాజ్ చేయాలి.
 
ప్రతి రోజూ తగినంత నీళ్ళు త్రాగడం వల్ల చర్మం మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. నిద్రలేవగానే మూడు గ్లాసుల నీళ్ళు త్రాగడం వల్ల ఆరోజంతా మీకు కావల్సినంత ఎనర్జీని అందిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.