శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (18:46 IST)

వేసవిలో మస్క్ మెలోన్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి!

వేసవిలో మస్క్ మెలోన్ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది. మస్క్ మెలోన్‌ను మెత్తగా గుజ్జులా చేసి అందులో కొద్దిగా ఉప్పు లేదా ఫుల్లర్స్ ఎర్త్‌ను మిక్స్ చేసి శరీరానికి అప్లై చేసి మర్దన చేయాలి. ఇందులో నీళ్ళు అధికంగా ఉండటం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇది ముడతలను నివారిస్తుంది. చర్మ నిగారింపును పెంచుతుంది. 
 
మస్క్ మెలోన్ తొక్క, లోపలి విత్తనాలను తొలగించి, ముక్కలుగా చేసి, అందులో పంచదార వేసి మిక్స్ చేయాలి. పంచదారకు బదులుగా బ్రౌన్ షుగర్ వేస్తే మంచి ఫ్రాగ్రెన్స్‌ను అందిస్తుంది. దీన్ని శరీరానికి మర్ధన, లేదా మసాజ్ చేస్తే శరీరం మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి మిమ్మల్ని యవ్వనంగా కనబడేలా చేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.