శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 17 నవంబరు 2014 (18:54 IST)

ఆవనూనెతో శిరోజాల సంరక్షణ చిట్కాలు!

దుమ్ము, ధూళి, కాలుష్యం, పోషకాహార లోపంతో కేశాల సంరక్షణ అసాధ్యమవుతోంది. వీటి ప్రభావంతో వెంట్రుకలు రాలడం, నిర్జీవమవడం వంటివి తలెత్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం లభించాలంటే... 
 
ఆవనూనెలో కొన్ని ఉసిరిముక్కలు, మెంతి గింజలు కలిపి వేడిచేయాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ నూనెను వెచ్చబరిచి కుదుళ్లకు పట్టించాలి. రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపుతో మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా 2-3 నెలలు చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాదు. ఒత్తు పెరుగుతుంది. 
 
* 2-3 నెలలకు ఒకసారి చిట్లిన వెంట్రుకల చివరలను కత్తిరించాలి. దీనివల్ల వెంట్రుక పెళుసుబారి తెగిపోకుండా బలంగా పెరుగుతుంది. 
 
* హెయిర్ కలర్, సీరమ్, కండిషనర్స్, కర్లింగ్ మెషిన్ లేదా బాండింగ్ ఉత్పత్తులు వెంట్రుకలను దెబ్బతీస్తాయి. పొడిబారేలా చేసి, వెంట్రుక పెరుగుదలను నిరోధిస్తాయి. అందుకని వీటిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. 
 
కేశాల సంరక్షణ కోసం ప్రతిరోజూ తాజా పండ్లు, బాదం పప్పు, గుడ్డులోని తెల్లసొన, ఉసిరిక పొడి తీసుకుంటే ఫలితం ఉంటుంది.