బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:35 IST)

అందమైన గోళ్ల కోసం.. పనులు పూర్తవగానే..?

అందమైన గోళ్లు పొందాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో కండి. సాధారణంగా బట్టలు ఉతకడం, పాత్రలు తోమడం వంటి పనులతో గోళ్లు పాడవుతాయి. కొన్నిసార్లు విరిగిపోతుంటాయి.

ఇలా జరగకుండా ఉండాలంటే ఆ పనులు పూర్తవగానే మాయిశ్చరైజర్ లేదా కొంచెం ఆలివ్ నూనె చేతులకు రాసుకుని మర్దన చేయండి. దీనివల్ల గోళ్లు పెళుసు బారవు. చేతి వేళ్లకు తేమ అంది మృదువుగా తయారవుతాయి. 
 
చేతులు, గోళ్లూ మురికిగా ఉన్నప్పుడు కాంతివిహీనంగా తయారైతే గోళ్లను చక్కగా కత్తిరించుకుని పది నిమిషాలు బాదం నూనెలో కొంచెం పంచదార కలిపి గోళ్లకీ, చేతికీ రాసి కాసేపు మర్దన చేస్తే ఫలితం ఉంటుంది.