శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (16:40 IST)

గోళ్లు తరచుగా విరిగిపోతుంటే..?

గోళ్లు పసుపు పచ్చగా మారి, తరచుగా విరిగిపోతుంటే కఠిన రసాయనాల ప్రభావంతో కానీ, పోషకాహార లేమితో కానీ ఇబ్బంది పడుతున్నారని  అర్థం. గోళ్లు దృఢంగా ఉండటానికి తీసుకునే ఆహారంలో ఆకుకూరలూ, గుడ్లూ, బీన్స్, మొలకల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 
 
రోజూ రాత్రి పూట గోరువెచ్చని నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బాదం నూనె వేసి గోళ్లు నానేటట్లుగా కాసేపు ఉంచండి. సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది. అలాగే గోరువెచ్చని పాలు, తేనె, పంచదార మిశ్రమంతో గోళ్లను మర్దన చేసుకుంటే గోళ్లు.. చుట్టూ చర్మం మృదువుగా తయారవుతుంది.