శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (17:36 IST)

నెయిల్ పాలిష్‌‍తో వీర్యం ఉత్పత్తి తగ్గిపోతుందట.. మహిళల్లో కూడా?

నెయిల్ పాలిష్ పెట్టుకునే మహిళలు, పురుషులకు ఇబ్బందులు తప్పవని దక్షిణ కొరియాలో గల సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ సైంటిటస్టుల హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం నెయిల్ పాలిష్‌లో ఉండే ట్రై ఫినైల్‌ పాస్పేట్‌ (టీపీహెచ్‌పీ). ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 1500 రకాల నెయిల్‌ పాలిష్‌లన్నీ టీపీహెచ్‌పీతోనే తయారయ్యాయని పరిశోధనల్లో వెల్లడైనట్లు తెలిసింది. 
 
ఇంకా ముఖ్యంగా నెయిల్ పాలిష్ పెట్టుకునే మగవారిలో వీర్యం ఉత్పత్తులు తగ్గిపోతాయట. అలాగే.. గోళ్ల రంగు పెట్టుకున్న 26 మంది మహిళల యూరిన్‌ శాంపిల్స్‌ను పరిశీలించగా అందులో టీపీహెచీపీ ఉన్నట్టు తేలిందట. శరీరంలోకి టీపీహెచ్‌పీ ప్రవేశిస్తే అది కీలక అవయవాలను దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేగాకుండా నెయిల్ పాలిష్‌లోని కెమికల్స్ బరువును పెంచుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.