మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (20:36 IST)

ముడతలకు చెక్ పెట్టాలా.. పైనాపిల్, ఆపిల్ జ్యూస్ వాడండి

ముఖంపై వుండే ముడతలను నివారించడంలో పైనాపిల్స్ బాగానే సహకరిస్తాయి. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క స్పూన్ చొప్పున పైనాపిల్ రసం, యాపిల్ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమ

చర్మంపై ముడతలకు చెక్ పెట్టాలా? ఈ చిట్కాలు పాటిస్తే సరి.. తాజా టమోటోలను బాగా చితక్కొట్టి.. ఆ జ్యూస్‌ తీసుకోవాలి. ఆ జ్యూస్‌లో రెండు చెంచాల పాలు కలిపి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా తయారైన ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, 10-15 నిమిషాలపాటు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించబడతాయి. ముఖానికి కొత్త అందం చేకూరుతుంది. 
 
అలాగే ముఖంపై వుండే ముడతలను నివారించడంలో పైనాపిల్స్ బాగానే సహకరిస్తాయి. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క స్పూన్ చొప్పున పైనాపిల్ రసం, యాపిల్ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనిలో ఉన్న రసాల చర్యల ద్వారా ముఖచర్మం బాగా శుభ్రమవుతుంది. ముడతలు నివారించబడి, మెరిసే సౌందర్యం పొందవచ్చు.