శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శనివారం, 24 మార్చి 2018 (17:19 IST)

స్తన సౌందర్యానికి ఏ విధమైన వ్యాయామం చేయాలి?

మహిళల్లో కొందరు తమ స్తన సౌందర్యం గురించి ఆందోళన చెందుతుంటారు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే స్తన సౌందర్యాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి చిట్కాలు పాటించాలంటే... 1. అందంగా కనపడటానకి కొన్ని వ్యాయమాలు చేయాలి. చాపపై వెల్లికిలా పడుకోండి. అరచేతులు బోర్లా

మహిళల్లో కొందరు తమ స్తన సౌందర్యం గురించి ఆందోళన చెందుతుంటారు. చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే స్తన సౌందర్యాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. ఎలాంటి చిట్కాలు పాటించాలంటే...
 
1. అందంగా కనపడటానకి కొన్ని వ్యాయమాలు చేయాలి. చాపపై వెల్లికిలా పడుకోండి. అరచేతులు బోర్లా వుంచండి. తలక్రింద దిండు పెట్టుకోండి. గాఢంగా గాలి పీల్చి కొంచం సేపటి తర్వాత గాలి వదలండి. తలను కుడి ఎడమలకు మార్చుతుండండి. అలాచేస్తే స్తనాల చుట్టుకొలత పెరుగుతుంది. రోజుకు కనీసం రెండుసార్లు చేయండి.
 
2. నిలబడి రెండు చేతులు తొడల వద్దకు జార్చండి. వెంటనే రెండు చేతులు పైకెత్తి అరచేతులు తలపైన కలపండి. మరల క్రిందకు చాపండి ఇరవైసార్లు వేగంగా చేస్తే స్తనస్థలం పెరుగుతుంది.
 
3. మేడి నూనె లేదా దానిమ్మ నూనె తీసుకొని స్తనాల క్రింది నుండి పైకి గుండ్రంగా మాలిష్ చేయండి. రక్త ప్రసరణ పెరిగి స్తనాల బిగుతుగా అందంగా తయారవుతాయి.
 
4. నిలబడి చేతులను గుండ్రంగా ముందు వైపుకు, వెనక వైపుకు పదిసార్లు రెండు పూటలా తిప్పండి.
 
5. నిలబడి రెండుచేతులు ముందుకు వంచి మరల నడుస్తూ స్తనాల దగ్గరగా వచ్చేలా చేయండి. అలా చేస్తే స్తన స్థలం వద్ద చర్మము వ్యాకోచము చెంది స్తనాలు పెరుగుతాయి.
 
6. పిల్లలకు పాలిచ్చేటప్పుడు బిడ్డను స్తనానికి వీలైనంత దగ్గరగా వుంచండి. బిడ్డ దూరం ఎక్కువైతే స్తనం క్రిందకి జారడానికి అవకాశం వుంది. అంతేకాదు నడిచేటప్పుడు నిటారుగా నడవడం అలవాటు చేసుకోవాలి.