శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 11 జులై 2018 (12:44 IST)

మెుటిమలతో బాధపడుతున్నారా? ఓట్స్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

కాంతిహీనంగా మారిన చర్మం మృదువుగా మారాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మెుటిమలు, మచ్చలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ మంచివంటున్నారు నిపుణులు.

కాంతిహీనంగా మారిన చర్మం మృదువుగా మారాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. మెుటిమలు, మచ్చలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు పోగొట్టుకోవడానికి ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్స్ మంచివంటున్నారు నిపుణులు. పండ్లు, కూరగాయలు, డ్రై ప్రూట్స్ ఇలా వాటిల్లో దొరికే పదార్థాలతోనే చక్కని ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చును.
 
ముందుగా ఓట్స్, తేనే కలుపుకుని పేస్ట్‌లా చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక బౌల్‌‌లోకి తీసుకుని అందులో శెనగపిండి, పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో ఆలివ్ ఆయిల్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి.
 
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రచేసుకోవాలి. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చును. ఇలా చేసుకుంటే ముఖంలో గల మెుటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.