గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2014 (17:01 IST)

ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టాలంటే.. ఇవిగోండి చిట్కాలు!

ఆయిలీ స్కిన్‌కు చెక్ పెట్టాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందేనని బ్యూటీషన్లు అంటున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మన్నికైన ఫేస్ మాస్క్‌ను అప్లై చేయాలి. గంధం, ముల్తానీ మట్టి వంటి ఫేస్ మాస్క్‌లు ఆయిలీ స్కిన్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 
 
గంధం లేదా ముల్తానీ ఫేస్ మాస్క్‌గా వేసుకున్నాక పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఆయిలీ స్కిన్ గ్లోగా తయారవుతుంది. 
 
కాలుష్యం అధికంగా ఉన్న వాతావరణంలో తిరిగినప్పడు, ఆయిల్ స్కిన్ నివారించడానికి బయటకు వెళ్ళి వచ్చిన ప్రతి సారి ముఖంను శుభ్రం చేసుకుంటుండాలి. అందుకోసం ఆల్కాహాలిక్ ఫ్రీ టోనర్‌ను ఉపయోగించడం ద్వారా ఆయిలీ ఫ్రీగా ఉంచుతుంది. 
 
మాయిశ్చరైజ్ ట్రై చేయాలి. సన్ స్క్రీన్‌ను రెగ్యులర్‌గా అప్లై చేయాలి. ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మర్చిపోకండి. ఇది సూర్యరశ్మిలోని హానికరమైన కిరణాల నుండి మీ చర్మంకు రక్షణ కల్పిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.