శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (13:48 IST)

ఆలివ్ ఆయిల్ ప్యాక్‌తో కేశ సంరక్షణ!

ఆలివ్ ఆయిల్ ప్యాక్‌తో కేశాలను సంరక్షించుకోవడం సులభమని బ్యూటీషన్లు అంటున్నారు. ఆలివ్ ఆయిల్‌తో జుట్టు మృదువుగా తయారవుతాయి. మాడంతా పొడిగా మారినట్లు లేదా చుండ్రు సమస్యను ఎదుర్కొంటుంటే.. ఆలివ్ ఆయిల్ ప్యాక్‌ను ట్రై చేస్తే, డాండ్రఫ్ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఆలివ్ ఆయిల్ ప్యాక్‌కు గడ్డ పెరుగు ఒకకప్పు, ఆలివ్ ఆయిల్ మూడు చెంచాలు మాత్రమే చాలు. ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి.
 
దీనిలోనుంచి కాస్త మిశ్రమాన్ని మాడుపై వేసి ఓ పది నిమిషాల పాటు గుండ్రంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ తో జుట్టు మొత్తం కింద వరకూ ప్యాక్‌లాగా వేసుకోవాలి. అరగంట తర్వాత షాంపూతో శుభ్రంగా తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
గమనిక: వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకుంటే మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్త పడాలి.