శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2017 (10:53 IST)

మొటిమలను దూరం చేసుకోవాలంటే? ఉల్లిపాయ బెస్ట్..

ముఖంపై మొటిమలకు చెక్ పెట్టాలంటే.. నలక్కొట్టిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం నీటిలో కలిపి.. దానిని మొటిమలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఐరన్ చేస్తున్నప్పుడు కానీ స్టౌపై పెట్టిన గిన్నెల్ని దించుతున్నప

ముఖంపై మొటిమలకు చెక్ పెట్టాలంటే.. నలక్కొట్టిన ఉల్లిపాయ ముక్కలను కొంచెం నీటిలో కలిపి.. దానిని మొటిమలపై రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఐరన్ చేస్తున్నప్పుడు కానీ స్టౌపై పెట్టిన గిన్నెల్ని దించుతున్నప్పుడో కొద్దిగా కాలితే ఆ ప్రాంతాల్లో ఉల్లిపాయన రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అలాగే తేనెటీగ కుట్టినచోట ఉల్లిపాయతో రుద్దితే బాధ తీవ్రత నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 
ఇక తుప్పు పట్టిన చాక్‌లపై ఉల్లిపాయతో రుద్దితే మెరవడం ఖాయం. కొత్తగా పెయింట్ వేసిన గదిలో ఆ వాసన పోవడానికి ఉల్లి రూమ్ ఫ్రెషనర్‌లా పనిచేస్తుంది. నీళ్లు ఉన్న ఒక పాత్రలో తాజా ఉల్లిపాయ ముక్కలను ఉంచి ఆ పాత్రను ఒక రోజు రాత్రంతా ఆ గదిలో ఉంచితే మంచి ఫలితం కనబడుతుంది.