మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (15:21 IST)

శీతాకాలంలో నారింజతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే..?

శీతాకాలంలో నారింజ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజ చర్మ సౌందర్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది.. ఎలాగంటే.. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు, తేనె కలిపి స్క్రబ్‌ తయారు

శీతాకాలంలో నారింజ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నారింజ చర్మ సౌందర్యాన్ని ఎంతగానో మెరుగుపరుస్తుంది.. ఎలాగంటే.. నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు, తేనె కలిపి స్క్రబ్‌ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల చలికాలం చర్మం పగలడం, పొడిబారడం వంటివి తగ్గుతుంది.
 
అలాగే ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్లు పైనాపిల్‌ జ్యూస్‌, ఒక్కో టీస్పూను చొప్పున గ్లిజరిన్, పాలపొడి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసి ఇరవైనిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, ఇతరత్రా కురుపులు, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.