శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (16:34 IST)

బొప్పాయితో 3 సూపర్ బ్యూటీ ఫేస్ మాస్కులు!

పార్టీలకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే అరగంటకు ముందే బొప్పాయితో హోం మేడ్ ఫేస్ ప్యాక్ మరింత అందంగా కనిపించండి. బొప్పాయితో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే చర్మం కాంతివంతమౌతుంది.
 
బొప్పాయి గుజ్జులో గుడ్డు తెల్లసొన వేసి ఫేస్ మాస్క్ లా వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే, చర్మం బిగుతుగా తయారవుతుంది. తద్వారా వృద్ధాప్య ఛాయలను తొలగించుకోవచ్చు. 
 
అలాగే బొప్పాయి గుజ్జులో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, 15నిముషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
 
బొప్పాయి గుజ్జులో ఓట్ మీల్ పౌడర్ వేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత రుద్ది కడగితే, స్క్రబ్బింగాల పనిచేస్తుంది, డెడ్స్ స్కిన్ సెల్స్‌ను తొలగిస్తుంది.