మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (18:16 IST)

మొటిమలను నివారించాలంటే.. మేకప్‌ను నివారించాలి!

మొటిమలతో ఇబ్బంది పడుతుంటే మేకప్‌ను నివారించాలి. పరిమితికి మించి మేకప్ వేసుకోవడం లేదా రెగ్యులర్‌గా మేకప్‌లో ఉండటం వల్ల కూడా మొటిమల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి, మేకప్‌ను మితంగా మాత్రమే ఉపయోగించుకోవాలి. మేకప్ వల్ల కూడా ముఖంలో మొటిమలు ఏర్పడుతుంటే, చర్మం చాలా సున్నితమైనదని గ్రహించాలి. అందుచేత మేకప్ కూడా చర్మం యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది. దాంతో మరిన్ని చర్మ సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు. 
 
సూర్య రశ్మి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పరిమితి మించితే మాత్రం చర్మ సమస్యలు ఎదుర్కోక తప్పదు. మీకు సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు, సూర్యరశ్మి మరో సమస్యను తెచ్చిపెడుతుండి. కాబట్టి, మంచి సన్ స్క్రీన్‌ను అప్లై చేయాలి. నీడలో ఎక్కువగా ఉండాలి. సన్ గ్లాస్ ఉపయోగించాలి. ఎక్కువగా ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చునని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.