గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 3 ఆగస్టు 2019 (15:20 IST)

వేప, పసుపు, పెరుగులతో మొటిమలను తొలగించవచ్చు...

నేటి తరుణంలో చాలామంది మెుటిమల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు. అందుకు ఎన్ని క్రీమ్స్, ఫేస్‌మాస్క్స్ వేసుకున్నా ఫలితాలు కనిపించలేదని చింతన. మరి ఏం చేయాలి దేవుడా అంటూ మొరపెడుతుంటారు. ఈ చిన్న విషయానికే దేవుడిని డిస్టప్ చేయడం ఎందుకు.. ఇంట్లో చిట్కాలు పాటిస్తే ఎలాంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం ఉండదు. మరి అవేంటో తెలుసుకుందాం...
 
1. వేపాకులను నీటిలో మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 45 నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచు చేస్తే మెుటిమ సమస్య పోవడమే కాకుండా ముఖం తాజాగా మారుతుంది. 
 
2. బియ్యం కడిగిన నీటిని మెుటిమలపైన మృదువుగా రుద్దాలి. ఇలా రోజూ చేస్తే మెుటిమలు తగ్గుతాయి. అలానే కస్తూరి పసుపులో కొద్దిగా నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే ఫలితం ఉంటుంది. 
 
3. స్నానానికి ముందుగా చర్మానికి పసుపు రాసుకోవాలి. ఓ 15 నిమిషాల తరువాత స్నానం చేస్తే మెుటిమలు తగ్గించుకోవచ్చు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు దుమ్ము చేరకుండా.. చల్లని నీటిలో ముఖం కడుక్కోవాలి. లేదంటే సమస్య ఎక్కువైపోతుంది. 
 
4. పావుకప్పు పెరుగులో కొద్దిగా వంటసోడా కలిపి చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మెుటిమలు రావు. చర్మం కాంతివంతంగా మారుతుంది.