గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 4 జూన్ 2015 (16:53 IST)

ఆలూతో అందంగా తయారవ్వండి!: శిరోజాలు మెరవాలంటే..?

ఆలూను ఆహారంగా మాత్రమే కాదు.. అందం విషయంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఆలూ నుంచి తీసిన రసాన్ని పట్టిస్తే కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు తొలగిపోతాయి. మనిషిని నిత్యయవ్వనంతో మెరిపించే శక్తి ఆలూకు ఉంది.

బంగాళాదుంపల్ని చిన్న ముక్కలుగా కోసుకుని మొహానికి అప్లై చేస్తూంటే చర్మపు ముడతలు తొలగిపోతాయి. మొహంపై ఉండే నల్లటి మచ్చలను కూడా తొలగించే శక్తి బంగాళాదుంపకు ఉంది. చర్మంపై మృతకణాలను ఇది తొలగిస్తుంది. 
 
శిరోజ సంరక్షణకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఒక ఆలుగడ్డ నుంచి రసాన్ని తీసి దానికి కోడిగుడ్డు తెల్లసొనను, కొంచెం నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు, మాడుకు పట్టించవచ్చు. ఇలా చేస్తే వెంట్రుకలు ఆరోగ్యవంతం అవుతాయి. మెరుస్తాయి.