బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (16:35 IST)

కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలంటే..?

కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలా? ఇంట్లో వాడే వస్తువులతోనే కంటి కింది వలయాల పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే? టొమాటోలో బ్లీచింగ్ గుణం ఉంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ టమోటా రసాన్ని కలిపి ఆ మిశ

కంటి కింద నల్లటి వలయాలు మాయం కావాలా? ఇంట్లో వాడే వస్తువులతోనే కంటి కింది వలయాల పోగొట్టుకోవచ్చు. ఎలాగంటే? టొమాటోలో బ్లీచింగ్ గుణం ఉంది. ఒకటిన్నర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక స్పూన్ టమోటా రసాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని కళ్లకింద ఉన్న నల్లటి వలయాల మీద రాసి.. పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే బాదం నూనెను కళ్లకు కింద నల్లటి వలయాలపై రాసి.. రాత్రంతా అలానే ఉంచుకుని.. ఉదయాన్నే కడిగేయాలి. ఇక బంగాళాదుంపలోనూ బ్లీచింగ్ గుణాలున్నాయి. అందుచేత బంగాళా దుంపను తురిమి జ్యూస్‌లాగా చేసి కాటన్ ప్యాడ్స్‌ను ఆ జ్యూసులో కొద్దిసేపు నానబెట్టి వాటిని కనురెప్పల మీద 15 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి వలయాలు తొలగిపోతాయి.
 
ఇక రోజ్ వాటర్‌లో కాటన్ ఉండల్ని నానబెట్టి వాటిని కనురెప్పలపైన 15 నిమిషాలపాటు ఉంచాలి. ఇలా రోజుకు రెండుసార్లు మూడు వారాల పాటు చేస్తే.. కంటి కింద నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు.