శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 6 ఏప్రియల్ 2015 (19:13 IST)

ప్రెగ్నెన్సీ స్కిన్ పిగ్మెంటేషన్‌కు చెక్ పెట్టే కుంకుమ పువ్వు!

ప్రెగ్నెన్సీ స్కిన్ పిగ్మెంటేషన్‌కు కుంకుమ పువ్వు చెక్ పెడుతుంది. బాదం మిక్సీలో వేసి, కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్నిస్కిన్ స్పాట్స్ మీద అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే స్కిన్ పిగ్మెంటేషన్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
పోస్ట్ ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్‌ను నివారించాలంటే.. ఒక బౌల్లో ఒక చెంచా నిమ్మరసం వేసి అందులో చిటికెడు పసుపు చేర్చి బాగా మిక్స్ చేసి అఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
ప్రసవం తర్వాత స్కిన్ పిగ్మెంటేషన్‌ను నివారించే హోం రెమెడీస్‌లో బెస్ట్ హోం రెమెడీ పెరుగు. డార్క్ స్కిన్ ప్యాచ్‌లున్న ప్రదేశంలో పెరుగును నేరుగా అప్లై చేయాలి. 20నిముషాలు ఎండిపోయే వరకూ ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.