శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 6 జూన్ 2015 (19:15 IST)

ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే జుట్టు రాలిపోతాయట!

ఎక్కువగా వేడి వాతావరణంలో తిరగడం లేదా చాలా వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం ద్వారా శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ గురి కావడం వల్ల జుట్టు డ్యామేజ్, బ్రేకేజ్ అవ్వడంతో పాటు, జుట్టు రాలిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు. కాబట్టి, సాధ్యమైనంత వరకూ హాట్ షవర్ కు హాట్ వెదరకు దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. 
 
అలాగే తలకు ఉపయోగించే బ్రెష్ లను కనీసం వారానికొకసారి శుభ్రం చేస్తుండాలి. తలలో ఉండే నేచురల్ ఆయిల్స్, అన్ నేచురల్ హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అవన్నీ బ్రెష్‌లో నిల్వఉంటాయి. వాటిని సరిగా శుభ్రం చేయకపోవడం వల్ల అవి తిరిగి తలలో చేరి హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఫాల్‌కు కారణం అవుతుంది.

అందుచేత జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఆహార పద్ధతుల్లో మార్పులు కూడా అవసరమేనని.. ఆకుకూరలు, పండ్లు తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్యను చాలామటుకు దూరం చేసుకోవచ్చునని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.