గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (14:10 IST)

రాత్రిపూట నిద్రించే ముందు ముఖాన్ని కడగాల్సిందే.. ఎందుకో తెలుసా?

రాత్రిపూట నిద్రపోయే ముందు ముఖాన్ని కడగాల్సిందే. ఇంకా రోజంతా మేకప్, దుమ్ముధూళితో ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. ఇవన్నీ పోవాలంటే... తప్పకుండా నిద్రించే ముందు ముఖం కడగాల్సిందేనని బ్యూటీషన్లు

రాత్రిపూట నిద్రపోయే ముందు ముఖాన్ని కడగాల్సిందే. ఇంకా రోజంతా మేకప్, దుమ్ముధూళితో ముఖంపై ఉన్న చర్మ రంధ్రాలన్నీ మూసుకుపోతాయి. ఇవన్నీ పోవాలంటే... తప్పకుండా నిద్రించే ముందు ముఖం కడగాల్సిందేనని బ్యూటీషన్లు అంటున్నారు. దుమ్ముధూళితో చర్మం కచ్చితంగా పాడైపోతుంది. కాబట్టి మంచి ఎక్స్‌ఫోలియేషన్‌ అవసరం. మంచి ఫేస్‌వాష్‌తో ముఖం కడుగుకుంటే మృతకణాలు తొలగిపోయి ముఖం మంచి కాంతిని సంతరించుకుంటుంది. 
 
సాయంత్రం ముఖం కడుగుతుంటే ముఖాన్ని అలా కాసేపు రుద్దాలనిపిస్తుంది. ఆ తరువాత మాయిశ్చరైజ్‌ అప్లై చేస్తాం. ఇలా ప్రతి రోజూ సాయంత్రం ఓ పదినిమిషాలు ముఖానికి కేటాయిస్తే గంటలు గంటలు పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
 
రోజంతా అలసిపోయి... సాయంత్రానికి ఏ జిమ్‌లోనో, స్విమ్మింగ్‌ పూల్‌లోనో సేదతీరి వస్తూ ఉంటారు. ఆ స్విమ్మింగ్‌పూల్‌లో, జిమ్‌లో గంటలపాటు ఉండటం వల్ల కూడా మీ ముఖంపై బ్యాక్టీరియా చేరుతుంది. సో ఇంటికి వచ్చిన తరువాత ముఖం కడుక్కోకపోతే బ్యాక్టీరియా మీ ముఖాన్ని పాడుచేస్తుంది. ఆ బ్యాక్టీరియాను చంపాలంటే ఫేస్ వాష్ చేయాల్సిందే.