మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 17 జనవరి 2015 (16:40 IST)

మృదువైన కేశాల కోసం ఏం చేయాలి?

షాంపు పెట్టి స్నానం చేసిన తర్వాత కండీషనర్ అప్లై చేయాలి. కండీషనర్ కు ప్రత్యామ్నాయంగా రైస్ వాటర్‌ను తలారా పోసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. హెయిర్ ఫాల్‌ను తగ్గించాలంటే.. బియ్యం కడిగిన నీళ్ళల్లో జుట్టును తడపాలి. 15 నిముషాల తర్వాత మంచి నీటితో స్నానం చేయాలి.
 
బియ్యం కడిగిన నీటి ద్వారా హెయిర్ స్ట్రక్చర్ చాలా అందంగా మారుతుంది. చిక్కుబడకుండా, స్కాంటీ,  పల్చబడటాన్ని కూడా తగ్గిస్తుంది. రైస్ వాటర్‌తో శుభ్రం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. చుండ్రు సమస్యను నివారించడానికి రైస్ వాటర్ తో తలస్నానం చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.