శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (13:09 IST)

గులాబీ రేకులతో స్నానం... ముత్యంలా మెరిసిపోతారు...

గులాబీ అంటే ఎవరు మాత్రం ఇష్టపడరు. సువాసనలు వెదజల్లే గులాబిలను అమ్మాయిలు అమితంగా ఇష్టపడతారు. అమ్మాయిలకు అందంతో పాటు, సౌందర్య సాధనంగా కూడా గులాబీలు ఉపయోగపడతాయి. ముఖ తేజస్సు పెరగాలంటే..  పది గులాబీ రేకలను నీళ్లలో గంటపాటు నానబెట్టి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీనికి రెండు టీ స్పూన్ల గులాబీ నీళ్లూ, మూడు టీ స్పూన్ల తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పావు గంట ప్రిజ్‌లో ఉంచాక వేళ్లతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రాయాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అంతే మిళ మిళ మెరిసేటి ముఖం మీ సొంతం.
 
గులాబీ పువ్వులు పొడిబారిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్‌లా కూడా ఉపయోగపడతాయి. అందుకోసం.. పది గులాబీ రేకలను మెత్తగా చేసి, అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లూ, రెండు చెంచాల తేనె, మూడు చుక్కల బాదం నూనె వేసి మిశ్రమంలా చేయాలి. దీన్ని ముఖంపై వలయాకారంగా రాస్తూ పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అంతే... పొడిబారిన మీ చర్మం మృదువుగా మారిపోతుంది. 
 
ఎనిమిది గులాబీ రేకలను మెత్తగా చేసి అందులో రెండు చెంచాల గులాబీ నీళ్లూ, చెంచా పెరుగూ, చెంచా తేనె వేసి కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. పది గులాబీలు, పది పుదీనా ఆకుల్ని మెత్తని మిశ్రమంలా చేయాలి. దీనికి చెంచా గులాబీ నీళ్లూ, గుడ్డులోని తెల్లసొన, చెంచా మొక్కజొన్న పిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి.