మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (15:47 IST)

అందమైన కనుబొమ్మల కోసం ఈజీ టిప్స్ పాటించండి!

ప్రతీ మహిళ అందమైన కనుబొమ్మలను కలిగివుండాలి ఆశిస్తుంది. ఇందుకోసం బ్యూటీ పార్లర్ల వెంట తిరగడం కంటే.. ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.. బ్యూటీషియన్లు. 
 
బ్యూటీపార్లలో షేప్ చేసుకున్నాక కనుబొమ్మలను అందంగా తీర్చిదిద్దుకోవాలంటే..  మస్కారాను ఉపయోగించడం మర్చిపోకూడదు. రెగ్యులర్‌గా మస్కారాను ఉపయోగించాలి. అప్పుటే అందమైన కనుబొమ్మలను పొందినవారవుతారు. మస్కారా యూజ్ చేయడం ద్వారా కనుబొమ్మలు దట్టంగా తయారవడంతో పాటు మంచి రంగునిస్తాయి. అలాగే క్రమం తప్పకుండా వాస్లిన్ రాసుకోవాలి. 
 
ముఖానికి రాసుకోవడంతో పాటు కనుబొమ్మల కోసం మార్కెట్లో లభించే వాస్లిన్‌ను తరచూ ఉపయోగించవచ్చు. రాత్రిపూట వాస్లిన్‌ను రాసుకుని తేలిగ్గా మర్దన చేసుకోవడం ద్వారా అందమైన కనుబొమ్మలు సొంతం చేసుకోవచ్చు. 
 
ఇక కనుబొమ్మల ఆరోగ్యానికి ఆహారం విషయంలో మెలకువ అవసరం. తీసుకునే ఆహారంలో విటమిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. రోజువారీ ఆహారంలో బి6, సీ, బయోటిన్ ఉండేలా చూసుకోవాలి. మంచి కాస్మెటిక్స్ వాడటం.. నిద్రించేటప్పుడు ఆముదాన్ని రాసుకోవడం ద్వారా కనుబొమ్మలు మరింత అందంగా తయారవుతాయి.