శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 జూన్ 2015 (17:24 IST)

చర్మం నిగనిగలాడాలంటే కంటి నిండా నిద్రపోండి

చర్మం నిగనిగలాడాలంటే కంటి నిండా నిద్రపోవాల్సిందే. కంటి నిండా నిద్రపోవటం ద్వారా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటం, చర్మ కాంతి విహీనంగా ఉండటం తగ్గిపోతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎ, సి, ఇ విటమిన్లు తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇవి పండ్లు, కూరగాయల్లో లభ్యమవుతాయి. 
 
పాల ఉత్పత్తులతో పాటు, నట్స్‌, ఆకుకూరలు, నిమ్మ, నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా ఎ, సి, ఇ విటమిన్లు ఉంటాయి. అదనంగా అరటిపండ్లు, కోడిగుడ్లు, గింజధాన్యాలు, చేపలు కొవ్వు తొలగించిన చికెన్, మటన్ తీసుకోవచ్చునని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. వీలైతే వ్యాయామం చేయాలి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంతో పాటు చర్మ కాంతిని కూడా మెరుగుపరుచుకోవచ్చు.