శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chitra
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (10:25 IST)

రోజ్ వాటర్.. టమాటా రసాన్ని ముఖానికి అప్లై చేస్తే...

చర్మం ఎప్పుడు అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే అధిక శాతం మంది కాస్మొటిక్స్‌ను వాడేందుకు ఇష్టపడరు. సహజ సిద్ధమైన పదార్థాలతోనే అందంగా కనబడాలని ప్రతి యొక్కరు అనుకుంటారు. సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.అవేంటో చూద్దాం!
 
నిమ్మరసంలో కొన్ని చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖం కడుక్కుంటే మిల మిల మెరుస్తుంది. 
  
టమాటా రసాన్ని స్నానానికి ముందు ముఖం అంతా పట్టించి స్నానం ముఖం నిగనిగలాడుతుంది.
 
ఓట్‌మీల్, బాదంపప్పు, పాలు, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతోపాటు శరీరమంతా పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే ముఖం కాంతిలీనుతుంది. 
 
నిమ్మరసంలో కొద్దిగా శెనగపిండి, చిటికెడు పసుపు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖంతోపాటు శరీరం మొత్తం పట్టించి ఆరిన తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. 
 
ముఖం మీది మురికిని తొలగించడానికి పాలు బాగా ఉపయోగపడతాయి. రాత్రి పడుకోవడానికి ముందు పాలతో ముఖం మీద ఉన్న మురికిని తొలగించి అనంతరం మాయిశ్చరైజర్‌ను ఐప్లె చేయాలి. పాలు చర్మ సౌందర్యాన్ని పరిరక్షించేందుకు బాగా తోడ్పడుతాయి. 
 
రోజ్ వాటర్‌తో కొద్దిగా టమాటా రసాన్ని కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అంతే ముఖం మెరిసిపోతుంది.