గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By chj
Last Modified: శనివారం, 16 జులై 2016 (17:31 IST)

బ్లీచింగ్ వ‌ల్ల ముఖానికి మెరుగు... ఇంటి చిట్కాలతోనే సాధ్యం...

ముఖానికి బ్లీచింగ్ చేయ‌డం వ‌ల్ల, అది చ‌ర్మాన్ని శుభ్రపరిచి, మచ్చల్ని దూరం చేసి, వాడిపోయిన చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. అయితే ఎప్పుడూ బ్లీచింగ్‌నే వాడాలని లేదు. ఎటువంటి దుష్ప్రభవాలు లేకుండా సహజంగా లభించే పదార్థాలతోనే ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు.

*రెండు చెంచాల గంధంలో చెంచా టొమాటో రసం, రెండు చెంచాల చొప్పున కీరదోస రసం, నిమ్మరసం వేసి ముఖానికి రాయాలి. తర్వాత రెండు నిమిషాల పాటు వేళ్లతో ముఖంపై రుద్దాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది.
 
* బంగాళాదుంప రసం ముఖానికి రంగు తేవడంలో సాయపడుతుంది. మొటిమల మచ్చల్నీ బ్లాక్‌హెడ్స్‌నీ తొల‌గిస్తుంది. దీనికోసం బంగాళాదుంపను ఉడికించి,చిదిమి ముఖానికి పట్టించి ఆరాక కడిగేయాలి. రోజుకు రెండుసార్లు చేస్తే చర్మం పూర్వపు ఛాయను సంత‌రించుకుంటుంది. 
 
* చెంచా చొప్పున తేనె, నిమ్మరసం, రెండు చెంచాల క్రీమ్ కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాయాలి. పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖంపై పేరుకుపోయిన మురికి వదిలిపోతుంది. తేనె, నిమ్మరసం మిశ్రమం ముఖానికి సహజ బ్లీచ్‌గా పని చేసి మచ్చల్ని తొలగిస్తాయి.
 
* రెండు చెంచాల నారింజ తొక్కల పొడిలో చెంచా చొప్పున పెరుగు, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తరవాత చన్నీళ్లతో కడిగేయాలి.