శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 8 ఆగస్టు 2016 (12:40 IST)

తేనె, సోయాపిండి, కొబ్బరిపాలతో సూపర్ ప్యాక్.. లాభం ఏంటి?

చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమా

* చర్మం మరీ పొడిబారితే.. చెంచా తేనెలో సోయా పిండి, కొబ్బరిపాలు రెండుచెంచాల చొప్పున కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాలయ్యాక రుద్దుతూ పూతను తీసేయాలి. మోము ప్రకాశవంతంగా మారుతుంది. శరీరానికైతే.. ఈ మిశ్రమాన్ని రెండింతలు కలిపి పూతలా వేసుకోవచ్చు.
 
* పొడిబారిన చర్మాన్నే కాదు. గాయాల్ని, కాలిన మచ్చలపెైనా రాసుకోవచ్చు. తగ్గించే శక్తి తేనె సొంతం స్నానానికి పదినిమిషాల ముందు తేనెను శరీరమంతా పట్టించుకోవాలి. దీనివల్ల చర్మం కోమలంగా తయారవుతుంది.
 
* మూడు చెంచాల కొబ్బరి నూనెకు నాలుగు చెంచాల తేనె కలిపి బాగా గిలక్కొట్టి తలకు రాసుకోవచ్చు. పొడిబారిన జుట్టుకి ఇది చక్కని పరిష్కారం. తేనె వల్ల జుట్టు నెరుస్తుందనేది కేవలం అపోహ మాత్రమే.
 
* ఒక టీ స్పూన్‌ నిమ్మరసంలో కొద్దిగా తేనె, రెండు చుక్కల గ్లిజరిన్‌ని కలపాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకి ప్రతిరోజూ అప్లై చేస్తూ ఉంటే పెదవులపై ఉన్న నలుపు క్రమంగా తగ్గి రోజా రేకుల్లాంటి రంగుతో మెరిసిపోతుంది.