శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (17:23 IST)

వేసవిలో ఆరెంజ్- పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి!

వేసవిలో ఆరెంజ్-పెరుగుతో ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే.. మెరిసే సౌందర్యాన్ని పొందవచ్చు. దీనిని ఫేస్ స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. నారింజ తొక్కలని ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి. దీనిని ఇంట్లో వేసుకునే పేస్ ప్యాక్స్ కోసం ఉపయోగించుకోవచ్చు.

ఈ పేస్ ప్యాక్ కోసం ఒక టీ స్పూన్ పెరుగును ఒక కప్‌లో తీసుకోవాలి దీనికి అర టీ స్పూన్ నారింజ తొక్క పౌడర్ కలుపుకోవాలి దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి.
 
ఒకవేళ మొటిమలు ఉంటే కొన్ని చుక్కలు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే మెరిసే చర్మ సౌందర్యాన్ని పొందవచ్చునని బ్యూటీషన్లు చెబుతున్నారు.