శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శనివారం, 19 జులై 2014 (17:52 IST)

స్ట్రాబెర్రీ స్పెషల్ : బ్యూటీ టిప్స్ ఇవిగోండి..

స్ట్రాబెర్రీలో ఎన్ని బ్యూటీ టిప్స్ దాగివున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. కెమికల్స్ క్రీమ్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం కంటే.. చర్మ సంరక్షణకు స్ట్రాబెర్రీలను ఉపయోగించవచ్చు. చర్మాన్ని తేమగా ఉంచడంలో సూపర్ డాక్టర్‌గా పనిచేసే స్ట్రాబెర్రీలను రోజూ రెండేసి తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. ముఖంలోని మొటిమలను తొలగిస్తుంది. 
 
సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. వేసవిలో ఈ పండుతో ముఖానికి మసాజ్ చేసుకుంటే సూర్యుడి తాకిడి ప్రభావం చర్మంపై ఉండదు. చర్మాన్ని కాంతివంతంగా, నిత్యయవ్వనంగా ఉండాలంటే స్ట్రాబెర్రీ పేస్ట్‌ను వారానికి మూడు సార్లు ముఖానికి రాసుకుంటే ఫలితం ఉంటుంది. ఐదారు స్ట్రాబెర్రీ పండ్లను ఓ క్లాత్‌లోకి తీసుకుని.. బాగా పిండి ఆ రసాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 
అలాగే 3 స్ట్రాబెర్రీ పండ్లతో పాటు ఏడు స్పూన్ల పాలను కలిపి పేస్ట్‌లా చేసుకుని ఈ పేస్ట్‌ను రోజూ ఉదయం పూట స్నానానికి ముందు ముఖానికి మాస్క్‌లా వేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత కడిగేస్తే చర్మం ప్రకాశిస్తుంది. తర్వాత ఎలాంటి క్రీమ్స్ పూయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఫేస్ డల్‌గా ఉండదు. ఒక కప్పు స్ట్రాబెర్రీ జ్యూస్‌తో పాటు.. ఒక కప్పు కేరట్ జ్యూస్ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాల తర్వాత ఐస్ వాటర్‌‌తో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.