గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (17:05 IST)

ఇతరుల సబ్బుల్ని ముఖానికి వాడుతున్నారా? (Video)

మహిళలు ముఖాన్ని పదే పదే శుభ్రం చేసుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. లేకుంటే చర్మ వ్యాధులు సోకే ప్రమాదముందని బ్యూటీషియన్లు అంటున్నారు. ముఖం కడిగేముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. లేనట్లైతే చేతుల

మహిళలు ముఖాన్ని పదే పదే శుభ్రం చేసుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. లేకుంటే చర్మ వ్యాధులు సోకే ప్రమాదముందని బ్యూటీషియన్లు అంటున్నారు. ముఖం కడిగేముందు చేతులను శుభ్రం చేసుకోవాలి. లేనట్లైతే చేతులకున్న మురికి ముఖ చర్మాన్ని తాకుతుంది. తద్వారా బ్యాక్టీరియాతో చర్మ సమస్యలు తప్పవు. 
 
స్క్రబ్‌కు ముందు ఫేస్ వాష్ వాడకూడదు, స్క్రబ్ వాడితే ముఖంపై సూక్ష్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆపై ఫేస్ వాష్ వాడితే వాటిలోని రసాయనాలు చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తాయి. బాగా చల్లటి లేదా వేడి నీటిని ముఖం కడిగేందుకు వాడకూడదు. గోరువెచ్చని నీటిని వాడాలి. 
 
ముఖం కడుక్కున్న తరువాత చల్లగా ఉండే ఐస్ క్యూబ్స్‌తో నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. మేకప్ వేసుకుంటే.. దాన్ని తొలగించిన తర్వాత ముఖాన్ని కడగాలి. లేకుంటే చర్మసమస్యలు తప్పవు. 
 
ముఖాన్ని కడిగేందుకు ఘాటైన సోప్ లను వాడకుండా మైల్డ్ గా ఉండే సోప్‌లనే వాడాలి. ఒకరు ఉపయోగించిన సబ్బుల్ని మరొకరు ఉపయోగించరాదు. ఒకే సబ్బును ఉపయోగించాలి. పదే పదే సబ్బులను మార్చడం చేయకూడదని బ్యూటీషియన్లు హెచ్చరిస్తున్నారు.