శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: శనివారం, 8 జూన్ 2019 (19:36 IST)

ఈ పండ్లతో మెరిసే చర్మం మీ సొంతం... ఎలాగో తెలుసా?

సాధారణంగా మనం గమనించినట్లైతే కొందరి చర్మం నున్నగా, సుతిమెత్తగా, బేబి స్కిన్ లా మెరిసిపోతూ, ఆరోగ్యంగా వుంటుంది. మరి కొందరిది పాలిపోయినట్లు ముఖంలో తేజస్సు లేకుండా కనిపిస్తుంది. ఎన్నో రకాల క్రీములు, ఎన్నో రకాల చిట్కాలు పాటించినా కూడా ఫలితం ఉండదు సరికదా.... మరిన్ని సమస్యలకు గురవుతుంటారు. మరి మెరిసే చర్మం కోసం కొన్ని చిట్కాలను ఇక్కడ చూద్దాం.
 
1. ముఖ్యంగా మెరిసే చర్మం కోసం కూరగాయలు, పండ్లతో తయారు చేసేటటు వంటి జ్యూసులు ఎక్కువగా తీసుకోవాలి.
 
2. చూడగానే నోరూరించే బొప్పాయి పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. తిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది. నిర్జీవమైన చర్మాన్ని కాంతి వంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు, యాపిల్ గుజ్జు, అరటిపండు గుజ్జు, కమలాఫలం తీసుకొని అందులో అరచెంచా తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తర్వాత కడిగినట్లైతే చర్మం మెరుపును సంతరించుకుంటుంది.
 
3. దానిమ్మ రుచికి మాత్రమే కాదు. దానిమ్మ గింజల్లో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా ఉండి శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఎరుపు రంగులో ఉండే దానిమ్మ మధుమేహగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో చక్కెర గణాంకాలు మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
 
4. స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో చిరు పులుపుతో, స్వీట్ గా స్వభావం కలిగి, చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ. ఈ ఫ్రూట్ తినడానికి మాత్రమే కాదు సౌదర్య సాధనంగా కూడా ఉపయోగించుకోవచ్చు. స్ట్రాబెరీలతో ఫేస్‌ మాస్క్‌ వేసుకుంటే ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. ముఖం మీద మచ్చలు తగ్గి ముఖం చంద్రబింబంలా వుంటుంది. చక్కటి నిగారింపు వస్తుంది. అంతేకాదు. దీనివలన ఫేస్‌ ప్రెష్‌‌గా కనిపిస్తుంది.
 
5. టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. టమాటాలను మిక్సీలో వేసుకుని జ్యూస్‌లాగా చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు లేదా చక్కెర వేసుకుని తీసుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది .అలాగే ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. విటమిన్స్‌ కూడా లభిస్తాయి.
 
6. జామకాయలో విటమిన్‌ 'ఏ' మరియు విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. జామకాయలో వుండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య సంబంధిత వ్యాధులు నయమవుతాయి. క్రమంగా చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.