బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 సెప్టెంబరు 2015 (19:09 IST)

చుండ్రుతో బాధపడుతున్నారా... మందారం కొబ్బరి నూనెలో వేసి పట్టించండి..

మందారం జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. మందారపువ్వులను కొబ్బరినూనెలో వేసి మరగించాలి. తర్వాత కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పూలలోని సారమంతా దిగేలా గట్టిగా పిండేయాలి. ఈ నూనెను గాలి చొరబడని డబ్బాలో వేసి వుంచి, తలకు రాసుకుంటే చుండ్రు అదుపులోకి వస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.
 
అలాగే గుప్పెడు గులాబీ రేకులను తీసుకుని వేడి నీటిలో వేయాలి. పది నిమిషాలు ఉంచి వాటిని బయటికి తీసి పిండేసి ఆ నీటిని మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత ఆరనిచ్చి ఆపై తలస్నానం చేస్తే జుట్టు శుభ్రపడటంతో పాటు చుండ్రు మాయమవుతుంది. 
 
చుండ్రు సమస్య తరచూ వేధిస్తుంటే.. గోరింటాకు పొడి ఏడు చెంచాలు, నిమ్మరసం ఒక స్పూన్, కొద్దిగా కొబ్బరి పాలు, యూకలిప్టస్ నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి ముప్పావు గంట పాటు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒక్కసారైనా చేయగలిగితే చుండ్రు సమస్య తగ్గుతుంది.