బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:32 IST)

డార్క్ స్కిన్‌కు చెక్ పెట్టే టమోటా జ్యూస్!

టమోటా జ్యూస్‌తో చర్మకాంతి పెంపొందించుకోవచ్చు. ముఖానికి టమోటో జ్యూస్ అప్లై చేయడం వల్ల చర్మం కాంతివంతం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు టమోటోను మధ్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగి మార్పును గమనించండి. 
 
టమోటో జ్యూస్‌తో డార్క్ స్కిన్ నివారించుకోవచ్చు. ఒక బౌల్లో, టమోటో జ్యూస్‌ను తీసుకొని అందులో కొద్దిగా నిమ్మరసం మరియు బేకింగ్ సోడా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం ప్రకాశిస్తుంది. 
 
టమోటోలో ఉండే అసిడ్, ఆస్ట్రిజెంట్స్ ముఖంలో జిడ్డును నివారిస్తుంది. చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిస్తుంది. టమోటోను రెండుగా కట్ చేసి గుజ్జును ముఖానికి అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఆయిలీ స్కిన్‌కు చెక్ పెడుతుంది.