గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By JSK
Last Modified: గురువారం, 7 జులై 2016 (14:22 IST)

అవాంఛిత రోమాలను సహజసిద్ధంగా తొలగించేందుకు చిట్కాలు...

*అవాంఛిత రోమాలను ఎఫెక్టివ్‌గా తొలగించడానికి చెన్నా దాల్ చాలా గొప్ప‌గా సహాయపడుతుంది. శెనపిండిలో కొద్దిగా నీళ్లు మరియు పసుపు మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

*అవాంఛిత రోమాలను ఎఫెక్టివ్‌గా తొలగించడానికి చెన్నా దాల్ చాలా గొప్ప‌గా సహాయపడుతుంది. శెనపిండిలో కొద్దిగా నీళ్లు మరియు పసుపు మిక్స్ చేసి తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. డ్రై అయిన తర్వాత స్ర్కబ్ చేయడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.
 
*గుడ్డులోని తెల్లసొన మరో మంచి హోం రెమెడీగా ప‌నిచేస్తుంది. ఇది అప్పర్ లిప్ హెయిర్‌ను చాలా ఎఫెక్టివ్‌గా తొలగిస్తుంది. ఇది చర్మాన్ని స్మూత్ చేసి మంచి ఫలితాలను అందిస్తుంది. ఒక బౌల్లో ఎగ్ వైట్‌ను తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్ మరియు షుగర్ మిక్స్ చేసి స్టిక్కీ పేస్ట్‌లా అయిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. అరగంట అలాగే ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మెరుగైన ఫలితం కోసం ఈ థెరఫిని వారంలో రెండుసార్లు చేసుకోవాలి. ఒక నెలలోపు పెదాల మీద హెయిర్ పెరగడం తగ్గుముఖం పడుతుంది.
 
*పసుపును ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బ్యూటి ప్రొడక్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మంను శుభ్రంగా ఉంచుతుంది. చర్మం ఎప్పుడు కాంతివంతంగా కనబడేలా చేస్తుంది. పాలు కూడా మీరు అందంగా కాంతివంతంగా కనబడుటకు సహాయపడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చాలా ఖచ్చితంగా నేచురల్‌గా చ‌ర్మానికి మంచి గ్లోను అందిస్తుంది. ఒక చెంచా పాలు మరియు పసుపును తీసుకొని బౌల్లో వేసి మిక్స్ చేయాలి. తర్వాత చేతి వేళ్ళతో అప్పర్ లిప్ మీద అప్లై చేయాలి. డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత రబ్ చేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.