శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (17:17 IST)

పాదాల పగుళ్ళకు చెక్ పెట్టే కొబ్బరినూనె!

వేసవిలో పాదాల పగుళ్ళను నివారించుకోవడానికి కొబ్బరి నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది. ఈ నూనెను ప్రతి రోజూ రెగ్యులర్‌గా ఉపయోగిస్తుంటే పాదాల పగుళ్ళను నివారించి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. అలాగే కొబ్బరినూనె బెస్ట్ మాయిశ్చరైజింగ్‌గా మార్చుతుంది. శరీరానికి కొబ్బరి నూనెను మొత్తం శరీరానికి అప్లై చేసినప్పుడు, డ్రై స్కిన్‌ను దూరం చేసుకోవచ్చు. 
 
అలాగే కళ్ళక్రింద ఉన్న సున్నితమైన చర్మం డ్రైగా.. డార్క్‌గా ఉన్నప్పుడు కొబ్బరి నూనెను అప్లై చేసి సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ నిద్రించడానికి ముందు అప్లై చేయాలి. ఇలాచేస్తే కంటికి కిందటి నల్లటి వలయాలను దూరం చేసుకోవచ్చు. 
 
ఇకపోతే.. కొబ్బరి నూనె శరీరానికి అప్లై చేస్తే శరీరం సాఫ్ట్‌గా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కొన్ని చుక్కల నూనెను స్నానం చేసే నీటిలో వేస్తే మంచి ఫలితం ఉంటుందని బ్యూటీషన్లు అంటున్నారు.