శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (16:06 IST)

మహిళలూ.. నిత్య యవ్వనం కోసం వ్యాయామం చేయండి.!

సాధారణంగా మహిళలు నిత్యం అందంగా ఉండేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటారు. ముఖ్యంగా మిలిమిలా మెరిసే సౌందర్యం కోసం, నిత్య యవ్వనం కోసం వారు తాపత్రయ పడుతుంటారు. ఇందుకోసం తమకు తెలిసిన పద్దతులు, వైద్యులను సంప్రదిస్తుంటారు. కానీ, శారీక వ్యాయామం చేయడం మాత్రం మరిచిపోతుంటారు. 
 
ప్రతి రోజూ శారీరక వ్యాయామం చేయడం వల్ల శరీర పటుత్వం ఏమాత్రం తగ్గదని వారు చెపుతుంటారు. అలాగే, నీటిలో కొన్ని గులాబీ రేకులను వేసుకుని స్నానం చేయడం వల్ల శరీరం మిలమిలలాడుతుందట. 
 
అలాగే, కొద్ది నీటిలో పది చుక్కల పన్నీరు వేసి దానిలో ఓ పలుచటి గుడ్డను తడిసి స్నానం చేశాక ఆ గుడ్డతో ఒళ్లు తుడుచుకుంటే మంచి ఫలితం ఉంటుందట. సాధ్యమైనంత వరకు మాంసాహారం తినడం తగ్గించి, ఆకుకూరలు, ఫ్రూట్స్ సాలెడ్స్ వంటివి ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెపుతున్నారు. 
 
కూర్చొనేటప్పుడు నిటారుగా కూర్చోవడం, హుషారుగా నడవటం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. ఊపిరి బాగా బిగపట్టి మెల్లగా గాలి బయటకు వదలాలి. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల మహిళలు నిత్య యవ్వనంతో ఉంటారని నిపుణులు వైద్యులు చెపుతున్నారు.