శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : సోమవారం, 4 మే 2015 (18:57 IST)

వాల్‌నట్ ఆయిల్‌తో హెయిర్ లాస్‌కు చెక్ పెట్టండి.

వాల్‌నట్ ఆయిల్ హెయిర్ లాస్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. హెయిర్ లాస్‌తో బాధపడుతున్న వారికి వాల్‌నట్ ఆయిల్ అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండి సెల్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. వాల్‌నట్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులో అధిక పొటాషియం ఉన్నందున ప్రతి రోజూ తలస్నానానికి ముందు తలకు పట్టించి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎసెన్షియల్ ఆయిల్ సెల్స్ రీజనరేషన్, హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది.
 
వాల్‌నట్ ఆయిల్ చుండ్రును వదిలించుటలో గొప్పగా సహాయపడుతుంది. ఇది తలను శుభ్రంగా ఉంచుతంది. దీన్ని రెగ్యులర్‌గా తలకు పట్టించడం వల్ల చుండ్రును నివారించవచ్చు. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురియైనప్పుడు, సమస్యను నివారించుకోలేక నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు. వాల్‌నట్ ఆయిల్ ఈ ఇన్ఫెక్షన్‌కు అద్భుతంగా జవాబిస్తుంది. ఇది అద్భుతంగా ఫంగల్ ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో దివ్యౌషధంగా పనిచేస్తుంది.