గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (13:49 IST)

చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుంటే?

చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మో

చలికాలంలో స్నానానికి ముందు కొబ్బరి నూనె రాసుకుని.. మృదువుగా మర్దన చేసుకుంటే చర్మం పొడిబారదు. చర్మం తేమగా, తాజాగా కనిపిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. పాలు, పంచదార, తేనె మిశ్రమాన్ని మోచేతులు, మోకాళ్లకు రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది. చర్మం లోపల రక్తప్రసరణ సరిగ్గా జరిగేందుకు ఉపకరిస్తుంది.
 
చలికాలంలో తేమ అందించే సబ్బులే వాడాలి. సహజ నూనెలు, గ్లిజరిన్‌ ఎక్కువగా ఉన్నవి ఎంచుకున్నా సరిపోతుంది. చేతుల్ని కప్పి ఉంచేలా నూలు గ్లౌజులు ధరించడం ద్వారా చర్మాన్ని రక్షించిన వారవుతారు. ఈ కాలంలో ముఖానికి వేసుకునే పూతల విషయలో జాగ్రత్తగా ఉండాలి. పాలు, నూనె ఆధారిత పూతలు మేలుచేస్తాయి. ఆలివ్‌ నూనె కలిపిన పూతలు వేస్తే చర్మానికి ఎంతో మేలు చేస్తుందని బ్యూటీషన్లు సలహా ఇస్తున్నారు.