శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By CVR
Last Updated : శుక్రవారం, 24 అక్టోబరు 2014 (17:22 IST)

మగువ ముఖం మృదువుగా ఉండాలంటే... చిట్కాలు

మగువ అందాన్ని మొదట ప్రదర్శించేది ముఖమే. ముఖం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే నాలుగు టీ స్పూన్ల తేనెలో రెండు టీ స్పూన్ల పచ్చి పాలు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్లతో నెమ్మదిగా మూడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి.

ఆ తర్వాత పది నిమిషాల పాటు ఈ మాస్క్‌ని ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ విధంగా రెండు సార్లు చేస్తే ముఖం పొడిబారకుండా, మృదువుగా మిళ మిళ మెరిసిపోతుంటుంది.
 
ఒక పాత్రలో టీ స్పూన్ పాలపొడి, టీస్పూన్ తేనె, టీ స్పూన్ నిమ్మరసం, అరటి స్పూన్ బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, చర్మానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖాన్ని, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.