శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (16:34 IST)

హెయిర్ షైనింగ్ కోసం.. తేనె-పెరుగు ప్యాక్ ట్రై చేయండి.!

హెయిర్ షైనింగ్ కోసం.. తేనె-పెరుగు ప్యాక్ ట్రై చేయండి. జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకోవడం మంచిది.

ఒక కప్పు పెరుగులో, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనె తీసుకోవాలి. ముందుగా పెరుగులో నిమ్మరసం, తేనె వేసి పేస్ట్‌లాగా అయ్యేంత వరకూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుంచి చివర్ల వరకూ అప్లై చేసుకోవాలి. 
 
అరగంట తర్వాత షాంపుతో తలస్నానం చేసి కండీషనర్‌ను అప్లై చేయాలి. ఫలితంగా జుట్టుకు మెరుపు రావడంతో పాటు ఆరోగ్యంగా తయారవుతుంది. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు. తలస్నానానికి ఉపయోగించే షాంపూ తక్కువ గాఢత కలిగి ఉండేలా జాగ్రత్తపడాలి.