Widgets Magazine

బడ్జెట్‌తో ధరలు పెరిగేవి.. తరిగేవి ఏవి : కృషి కళ్యాణ్ పన్నుతో బాదుడు!

jaitley halwa prepare
pnr| Last Updated: సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (14:09 IST)
విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ కారణంగా అనేక వస్తువుల ధరలు మరింతగా పెరగనున్నాయి. ముఖ్యంగా బ్రాండెడ్ రెడీమేడ్ దస్తులు లెడ్ టీవీల ధరలు మరింత ప్రియం కానున్నాయి. అలాగే, అన్ని రకాల సేవలపై అదనంగా కృషి కల్యాణ్ పన్ను కారణంగా హోటల్, రెస్టారెంట్ బిల్లులు, ప్రయాణ చార్జీలపై మరికొంత చెల్లించుకోవాల్సిన పరిస్థితి.
సోమవారం లోక్‌సభలో ఆయన 2016 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బడ్జెట్ తర్వాత బ్రాండెడ్ రెడీమేడ్ వస్త్రాలు, లగ్జరీ కార్లు, బంగారం, ప్లాటినమ్ ఆభరణాలు, సిగరెట్లు, గుట్కా, ఖైనీ తదితర పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తులు, ఎల్ఈడీ టీవీలు, హై ఎండ్ స్మార్ట్ ఫోన్లు మరింత ఖరీదు కానున్నాయి.

అలాగే, కాఫీ, టీలు, వజ్రాలు తదితర రంగు రాళ్లు పొదిగిన ఆభరణాలు, తక్కువ ధరలకు లభించే స్మార్ట్ ఫోన్లు, స్టార్టప్ సంస్థల నుంచి వచ్చే ఉత్పత్తులు, సిమెంట్ తదితరాల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన సూచనను అరుణ్ జైట్లీ పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో దివ్యాంగుల్లో (వికలాంగులు) కనుచూపులేనివారు వినియోగించే బ్రెయిలీ పేపరును అన్ని రకాల సుంకాల నుంచి మినహాయింపునిచ్చారు. ఫలితంగా బ్రెయిలీ పేపరుపై సుంకాల తొలగింపుతో ఈ రకం పేపర్ ధర 25 నుంచి 30 శాతం మేరకు తగ్గనుంది.


దీనిపై మరింత చదవండి :