Widgets Magazine

బడ్జెట్ 2016 : రైతన్నలపై విత్తమంత్రి అరుణ్ జైట్లీ వరాల జల్లు

బడ్జెట్ 2016-17 ముఖ్యాంశాలు

farmers
pnr| Last Updated: సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:05 IST)
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు వరాల జల్లు కురిపించారు. వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు కేటాయించిన ఆయన.. ఇరిగేషన్‌ కోసం ఈ ఏడాది రూ. 17 వేల కోట్లు అవసరం అవుతాయని వెల్లడించారు. పంటల బీమా కోసం రూ.5500 కోట్లు కేటాయించారు. వ్యవసాయం, పశుపోషణకు ప్రాధాన్యం ఇస్తూనే, ఆన్‌లైన్‌లోనే ఆహార ధాన్యాల సేకరణ చేస్తామని ప్రకటించారు. దేశంలో తేనె ఉత్పత్తికి ప్రోత్సహకాలు ప్రకటించారు.

అలాగే, రూ.60 వేల కోట్లతో భూగర్భ జలాల వృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. భూసార అభివృద్ధికి రూ.368 కోట్లు, సేంద్రీయ వ్యవసాయానికి సహకారం రాబోయే మూడేళ్లలో 5 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం, పప్పు ధాన్యాల అభివృద్ధికి రూ.500 కోట్లు, గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం కోసం రూ.19వేల కోట్లు, దేశ వ్యాప్తంగా మార్కెట్ల ఏర్పాటు, ఏకీకృత వ్యవసాయ మార్కెట్‌ ఏర్పాటు, వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.9 లక్షల కోట్లు చొప్పున కేటాయించారు.
రైతులే దేశానికి వెన్నెముకని బడ్జెట్ సమావేశంలో జైట్లీ అన్నారు. అహార భద్రతలో రైతులే కీలకమని ఆయన గుర్తుచేశారు. 2020 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చూస్తామని జైట్లీ హామినిచ్చారు. రైతులకోసం మార్కెటింగ్‌ అవకాశాలు, నీటి లభ్యత పెంచుతామని ఆయన అన్నారు. దేశంలో 40 శాతం భూమికి మాత్రమే సాగునీటి వసతి ఉందని ఆరుణ్ జైట్లీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


దీనిపై మరింత చదవండి :