గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2016-17
Written By pnr
Last Updated : సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (11:54 IST)

వ్యవసాయ రంగానికి రూ.35,985 కోట్లు కేటాయింపు... పంటల బీమా రైతులకు భరోసా

2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ రంగానికి రూ.35,985 కోట్లను కేటాయించారు. అలాగే, ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ప్రధాని పంటల బీమా యోజన రైతులకు భరోసా ఇవ్వనుందని ప్రకటించారు. 
 
ప్రధానమంత్రి సించాయి యోజన ద్వారా అదనంగా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. గ్రామీణ, కీలక రంగాలకు అదనపు వనరులు సమకూర్చినట్టు తెలిపారు. గ్రామీణ, వ్యవసాయ, బ్యాంకింగ్‌ రంగాలకు ఆర్థిక దన్ను ఇస్తామని వెల్లడించారు. దేశంలో విదేశీ మారక నిల్వలు గరిష్ట స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా జీఎస్‌టీ ఆమోదం, కాలం చెల్లిన చట్టాలపై దృష్టి సారించినట్టు తెలిపారు. వచ్చే ఏడాదికి 9 సూత్రాల ఆధారంగా అభివృద్ధిని సాధించేలా చర్యలు చేపడుతామని ఆయన వెల్లడించారు.