Widgets Magazine

మొత్తం బడ్జెట్ రూ.19.78 లక్షల కోట్లు.. ఫ్రిజ్ ధరల్లో తగ్గుదల.. పెన్షనర్లకు 'పన్ను' ఊరట

fridge
pnr| Last Updated: సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (12:43 IST)
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ మొత్తం రూ.19.78 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.5.5 లక్షల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షల కోట్లని లోక్‌సభకు తెలిపారు.

అయితే, వచ్చే ఏడాది నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు ఉండవని ఆయన తెలిపారు. వివిధ పథకాల్లో భాగంగా రాష్ట్రాలకు ఎక్కువగా నిధులు ఇస్తున్నామని ఆయన గుర్తు చేశారు. రెవెన్యూలోటును కూడా తగ్గిస్తున్నామని జైట్లీ తెలిపారు.

ఈ తాజా బడ్జెట్ కారణంగా గృహోపకరణాలు, రిప్రెజిరేటర్స్‌ ధరలు తగ్గనున్నాయని అరుణ్ జైట్లీ తెలిపారు. వికలాంగుల కోసం తయారు చేసే ఉత్పత్తులపై ట్యాక్స్‌ మినహాయింపు ఇస్తున్నామని అన్నారు. పెన్షనర్లకు ట్యాక్స్‌ మినహాయింపు నిచ్చామన్నారు.
అలాగే, దేశ అభివృద్ధికి ట్యాక్స్‌లే కీలకమన్నారు. సొంత ఇల్లు లేనివారు, హెచ్‌ఆర్‌ఏ పొందనివారికి రిబేటు 24 వేల నుంచి 60 వేలకు పెంపు చేస్తున్నట్లు తెలిపారు. పారిశ్రామిక పన్నులను సరళీకరణ చేశామని ఆయన అన్నారు. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉండి పన్నుకడుతున్నవారికి రూ. 3 వేలు వెనక్కి ఇస్తామన్నారు. చిన్న పరిశ్రమలకు 29 శాతమే ట్యాక్స్‌ ఉండేలా చూస్తామని ఆయన అన్నారు.


దీనిపై మరింత చదవండి :