ఉత్పత్తులు తగ్గడంతోనే ధరల పెరిగాయి: ప్రణబ్

Gulzar Ghouse|
FILE
దేశంలో కారణంగా నిత్యావసర వస్తువుల ఉత్పత్తులు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు.

పప్పులు, బియ్యం, తేయాకు, చక్కెరలాంటి నిత్యావసరాల సరుకుల డిమాండ్‌ బాగా పెరిగిపోయిందని దానికి తగ్గట్టు కంపెనీల్లో ఉత్పత్తులు లేకపోవడంతో వాటి కనీస మద్దతు ధర కూడా పెరిగిందని మంత్రి వివరిం చారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరలు పెరిగినా ద్రవ్యోల్బణం మాత్రం మైనస్‌ విలువలను చూపించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం ధరలను క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉందని మంత్రి ఈ సందర్భంగా వివరించారు.


దీనిపై మరింత చదవండి :