ధర్మవరం పట్టు చీర దక్కిన జాతీయ మెరిట్ సర్టిఫికేట్

PNR| Last Modified బుధవారం, 12 అక్టోబరు 2011 (10:43 IST)
మన రాష్ట్రంలోని ధర్మవరం పట్టు చీరకు జాతీయ స్థాయి మెరిట్ సర్టిఫికేట్ దక్కింది. ముఖ్యంగా సంపంగి పట్టు చీరకు ఈ సర్టిఫికేట్ లభించింది. ఈ చీర జాతీయస్థాయిలో ధర్మవరం కీర్తిని ఇనుమడింపజేసినందుకు గాను డెవలప్‌మెంట్ కమిషనర్ ఫర్ హ్యాండ్‌లూమ్స్ ఈ సర్టిఫికేట్‌ను ప్రధానం చేసింది.

ఈ సంపంగి పట్టు చీర తయారు చేసిన చేనేత కార్మికుడు పెద్దయ్యగారి మోహన్‌కు పురస్కారంతో పాటు రూ.50 వేల నగదును బహుకరించనున్నారు. జాతీయ స్థాయిలో 2009 సంవత్సరానికి గాను 14 మందికి వివిధ రంగాల్లో జాతీయస్థాయి అవార్డులు దక్కగా 10 మందికి జాతీయస్థాయిలో మెరిట్ సర్టిఫికేట్లు లభించాయి.


దీనిపై మరింత చదవండి :