బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2016 (17:43 IST)

2015-16లో పెరగనున్న ఆహార ధాన్యాల ఉత్పత్తి: రాధామోహన్ సింగ్

2015-16 సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 253.16 మిలియన్‌ టన్నులకు పెరగనున్నట్లు తెలిసింది. కరువున్నప్పటికీ గోధుమ, పప్పు ధాన్యాలు దిగుబడిలో పెరుగుదల నమోదైంది. అయితే 2013-14 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 265.04 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, ఈసారి దిగుబడి 253.16 మిలియన్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 
 
గత రెండేళ్లలో పంటల దిగుబడిని పరిగణనలోకి తీసుకుంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గత ఏడాది (2014-15)లో 252.02 మిలియన్‌ టన్నుల దిగుబడి నమోదైంది. ఈ ఏడాది అంచనా దీనికన్నా స్వల్పంగా ఎక్కువ ఉంది. ఫిబ్రవరి-మార్చి మాసాలు గోధుమ పంటకు చాలా ముఖ్యం అయితే గతేడాది ఇదే సమయంలో తుపానుల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌ తెలిపారు.